Breaking News

GODAVARIKHANI

అనవసరంగా బయటికొస్తే అంతే..

అనవసరంగా బయటికొస్తే అంతే..

సారథి ప్రతినిధి, రామగుండం: లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి వచ్చిన వారిని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని పోలీసులు ఐసొలేషన్ సెంటర్ కు తరలించారు. ఏసీపీ ఉమెందర్ ఆధ్వర్యంలో సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, ఉమాసాగర్, సతీష్, రమేష్ లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. బయట తిరిగిన 20 వెహికిల్స్ ను సీజ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రతి గల్లీల్లో పెట్రోలింగ్ నిర్వహించగా, కారణం లేకుండా బయట తిరుగుతున్న […]

Read More
ర్నలిస్టులకు హ్యాండ్ కర్చీఫ్ లు పంపిణీ

జర్నలిస్టులకు హ్యాండ్ కర్చీఫ్ లు పంపిణీ

సారథి, రామగుండం ప్రతినిధి: కరోనా కష్టకాలంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేస్తున్న గోదావరిఖని ప్రెస్, మీడియా రిపోర్టర్లకు ఏసీపీ ఉమెందర్ చేతి రుమాలు అందజేశారు. జర్నలిస్టులు వడదెబ్బ బారినపడకుండా చూసుకోవడం తమ బాధ్యత అన్నారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేశ్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ప్రవీణ్, ఉమాసాగర్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Read More
ఆర్ఎఫ్​సీఎల్​ లో ఉద్యోగాలను అమ్ముకుంటున్రు

ఆర్ఎఫ్​సీఎల్​ లో ఉద్యోగాలను అమ్ముకుంటున్రు

సారథి, రామగుండం: ఆర్ఎఫ్​సీఎల్​ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా డబ్బులకు కక్కుర్తిపడి ఒక్కో ఉద్యోగానికి రూ.ఆరు నుంచి రూ.పదిలక్షలు వసూలు చేస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీపీసీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్ఎఫ్ సీఎల్ సీఈవోను వెంటనే బర్తరఫ్ చేసి సీబీఐ విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని రియాజ్ డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ఆకుల రామ్ కిషన్, తోట వేణు, వెల్తురు మల్లయ్య, […]

Read More
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

సారథి, రాముగుండం ప్రతినిధి: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బల్మూరి అమరేందర్ రావు ఎన్నికయ్యారు. మొత్తం 178 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 104 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి మేడ చక్రపాణికి 55 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన జవ్వాజి శ్రీనివాస్ కు 86ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి చందాల శైలజకు 81 ఓట్లు పడ్డాయి. కోశాధికారిగా బరిలో నిలిచిన ఈ.నరసయ్యకు 62, గుల్ల రమేష్ కు […]

Read More
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]

Read More
కులవృత్తులకు పెద్దపీట

కులవృత్తులకు పెద్దపీట

సారథి న్యూస్, పెద్దపల్లి: రామగుండం సమీపంలోని గోదావరి నదిలో చేప పిల్లలను ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​యాదవ్​మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తుందన్నారు. రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, స్థానిక కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు పాల్గొన్నారు.

Read More
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

సారథి న్యూస్​, గోదావరిఖని: స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ కు వచ్చిన కేంద్ర రసాయన ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్​ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వారిలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జ్​ఎంఎస్ రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం నందు, ఫక్రుద్దిన్, నగునూరి రాజు, పెండ్యాల మహేష్, నాజిమొద్దిన్, కౌటం సతీష్​ పాల్గొన్నారు.

Read More
ఎమ్మెల్యే.. మానవతా హృదయం

ఎమ్మెల్యే.. మానవతా హృదయం

సారథి న్యూస్, రామగుండం: మానవత్వం మంటగలుస్తున్న నేటి పరిస్థితిల్లో మానవీయతను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాథలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక చౌరస్తాలో ఓ అనాథ వృద్ధురాలిని తన వాహనంలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఉన్న ఓ వృద్దురాలిని షెల్టర్​కు తరలించి మానవీయతను చాటుకున్నారు. మంత్రి కె.తారక రామారావు […]

Read More