Breaking News

EMPLOYEES

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

సర్వీస్‌ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్​భరోసా సామాజికసారథి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్‌ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]

Read More
104 సేవలకు రాంరాం?

104 సేవలకు రాంరాం?

కొరవడిన మొయింటనెన్స్‌ డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]

Read More

పెండింగ్​ బకాయిలు ఇప్పించండి

సారథి న్యూస్, రామగుండం: తమకు వేతనాలు ఇప్పించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పీఆర్​పీ కోరారు. ఈ మేరకు వారు రామగుండం మున్సిపల్​ కమిషనర్​ ఉదయ్​కుమార్​కు వినతిపత్రం సమర్పించారు. జీతాలు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్​ ఉన్నారు.

Read More

సింగరేణిని కాపాడుకుందాం

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్​పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్​జీవన్​ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్​ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]

Read More
సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా​-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని […]

Read More
సింగరేణిలో విధుల బహిష్కరణ

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

సారథి న్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్​డౌన్​ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్​ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్​ డివిజన్​లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్​ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. కాంట్రాక్ట్​ కార్మికులకు కోవిడ్ క్వారంటైన్ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు సింగరేణి ఎండీకి లేఖ పంపినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, మధు తెలిపారు. సింగరేణిలో కాంట్రాక్ట్​, పర్మినెంట్​ కార్మికులందరినీ కరోనా మహమ్మారి వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్​ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్​ ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్​ చేశారు.

Read More

కరోనాపై అవగాహన

రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో బుధవారం ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​) ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి , ఉప సర్పంచ్ తుమ్మల రమేశ్​, వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More