బాధితులు అవస్థలు పడుతున్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిక జెనీవా: ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథానమ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. […]
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్..హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదే.. సాంకేతిక కారణాలు ఏమీ లేవు దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు న్యూఢిల్లీ: గత డిసెంబర్ 8న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ […]
ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]
ధాన్యం అమ్ముకోలేక నానాఇబ్బందులు డిండి ముంపు రైతులను ఆదుకోవాలి ‘ధరణి’లో తప్పులు ప్రభుత్వ వైఫల్యమే బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమలలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సామాజికసారథి, అచ్చంపేట/చారకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి తప్పుగా నమోదైందని, భువనగిరి కలెక్టరేట్ […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]
అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా? అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఎట్లిస్తారు టీపీసీసీ చీఫ్రేవంత్ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్ఏ టెస్ట్చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం […]
సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు, సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 10 న మెదక్ శాసన మండలికి జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]