![కేసీఆర్కు డీఎన్ఏ టెస్టు చేయాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/11HSB20.jpg?fit=467%2C350&ssl=1)
- అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా?
- అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఎట్లిస్తారు
- టీపీసీసీ చీఫ్రేవంత్ రెట్టి సూటిప్రశ్న
సామాజికసారథి, హైదరాబాద్: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్ఏ టెస్ట్చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఏపీ వారికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎవరూ అర్హులు లేరా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు. అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ టెండర్ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ పొద్దుటూరుకు చెందిన వ్యక్తిదేదన్నారు. ఆరు శాతం కన్సల్టెంట్ఫీజు ఇస్తుందన్నారు. రేకులు, ఇనుముతో కట్టిన నిర్మాణానికి రూ.177 కోట్లకు పెంచారన్నారు. రూ.60 కోట్లతో మొదలైన స్థూపం రూ.180 కోట్లకు పెంచారన్నారు. మంత్రి కేటీఆర్ ను మెప్పించి వ్యయం పెంచుకున్నారని విమర్శించారు. అమరుల స్థూపం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. నాలుగేళ్లు అవుతున్నా అమరుల స్థూపం ఎందుకు పూర్తికాలేదో విచారణ కమిటీ వేయాలన్నారు. ఈ కమిటీ వేసి ఆలస్యానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏమిటో తెలియాలన్నారు. ఈ అవినీతికి మంత్రి కేటీఆర్, అతని స్నేహితుడు తేలుకుంట్ల శ్రీధరే కారణమన్నారు టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి ఆరోపించారు.