సామాజికసారథి, తాడూరు: ఓ పంచాయితీ విషయంలో దివ్యాంగుడిపై సర్పంచ్ప్రతాపం చూపించాడు. సర్దిచెప్పాల్సింది పోయి సదరు వ్యక్తిపై పిడిగుద్దులకు దిగాడు. దీంతో ఆయన దవడ దెబ్బతినడంతో లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన గురువారం తాడూరు మండలం అల్లాపూర్‌లో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆవుల తిరుపతయ్య భిక్షాటన చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని సోదరుడి కుమారుడు బాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన శాంతయ్య గొడవపడ్డారు. ఈ విషయమై ఆవుల తిరుపతయ్యతో మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్ జి.నిరంజన్ […]
సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ కామెపల్లి భాస్కర్‌ను.. టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్‌ను అడిగి […]