పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి […]
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాలుగోసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు 69 ఏళ్ల నితీష్ కుమార్ ఎక్కువ సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనతను దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
బీహార్‌పై ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.16వేల కోట్ల తాయిలాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రధాని మోడీకి బీహార్‌కు నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ బీహార్‌కు రూ.16వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన రానున్న 10 రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ తదితర […]
పాట్నా: కరోనా ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్‌లోని దనాపూర్‌కు చెందిన మహేశ్ కుమార్(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్ […]
తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు పాట్నా: తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలియని ఆ పసిప్రాణం అమ్మను లేపేందుకు ప్రయత్నించి అలసిపోయింది. తల్లి చనిపోయిందని తెలియని వయసులో నవ్వుతూ ప్లాట్‌ఫాం మొత్తం తిరిగి ఆడుకున్నాడు ఆ బుడ్డోడు. బీహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండదెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని ఆ రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్నంటున్న […]