Breaking News

Day: October 8, 2020

పాశ్వాన్ ఇకలేరు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్​ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]

Read More
మోయతుమ్మెద వాగులో యువకుడి డెడ్​బాడీ

మోయతుమ్మెద వాగులో యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ వాగు, పిల్లివాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో గురువారం సాయంత్రం గుర్తుతెలియని ఓ యువకుడి డెడ్​బాడీ కొట్టుకువచ్చినట్లు తెలిపారు. కొట్టుకొచ్చిన మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

సారథి న్యూస్, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్​అలీ అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల కోసం అధిక నిధులు మంజూరు చేసిందని చెప్పారు. గురువారం యూసుఫ్ గూడ మొదటి బెటాలియన్ లో జరిగిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ […]

Read More
చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్వో

చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్ వో

సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్​రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ […]

Read More

రెబల్​ ఎంపీకి సీబీఐ షాక్​

వైసీపీ రెబల్​ ఎంపీ, నిత్యం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్​పై విరుచుకుపడే రఘురామకృష్ణంరాజుకు తొలిసారి షాక్​ తగిలింది. ఆయన ఇండ్లు, కంపెనీలు, ఆఫీసుల్లో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు… రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం […]

Read More

తమ్మినేని.. ఇదేంది?

కొంతకాలంగా ఏపీ హైకోర్టు తీర్పులపై వైఎస్సార్​సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్​ మీడియా విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తీర్పులను తప్పుపట్టారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నది. హైకోర్టు తీర్పులపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. […]

Read More
వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కె.తారక రామరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా వైద్యారోగ్యశాఖ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మహమ్మారి కట్టడికి కృచేసిన వైద్యులు, […]

Read More
2లక్షలు దాటిన కరోనా కేసులు

2లక్షలు దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. రోజుకు వందల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. గురువారం(24 గంటల్లో) 1,896 కరోనా పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 2,06,644కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 12 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,201 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 2,067 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితులు 1,79,075 మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్​ […]

Read More