Breaking News

Day: September 1, 2020

ఆడబిడ్డలకు వరం.. భగీరథ పథకం

సారథిన్యూస్​, రామగుండం: తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​భగీరథ పథకం.. ఆడబిడ్డలకు వరమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని సీఎస్పీ కాలనీలో ఎమ్మెల్యే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళల మంచి నీటికి కష్టాలు పడవద్దని ప్రతి ఇంటికి నల్లాద్వారా శుద్ధజలం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, […]

Read More

ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభం

సారథిన్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువు భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి టీ శాట్- దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. మంగళవారం తొలిరోజు విద్యార్థులకు టీవీ పాఠాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థులు టీవీల ముందు కుర్చొని పాఠాలు విన్నారు. కానీ సిగ్నల్​ లేకపోవడం, పవర్​పోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

Read More

గద్వాల మార్కెట్ చైర్​పర్సన్​గా రామేశ్వరమ్మ

సారథిన్యూస్​, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్​కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్​, సింగిరెడ్డి నిరంజన్​రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More

‘ఎన్నిక వాయిదా’ కాంగ్రెస్​ కుట్రే

సారథిన్యూస్​, గోదావరిఖని: కుట్రపూరితంగానే కాంగ్రెస్​ నాయకులు హైకోర్టుకు వెళ్లి రామగుండం నగరపాలక సంస్థ కో ఆప్షన్​ ఎన్నికను వాయిదా వేయించారని టీఆర్​ఎస్ నేతలు ఆరోపించారు. మంగళవారం టీఆర్​ఎస్​ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్ రామగుండం ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్​ పరిధిలో టీఆర్​ఎస్​కు 39 మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్​కు 11 మంది మాత్రమే ఉన్నారు. కార్పొరేటర్ల మెజార్టీతో టీఆర్​ఎస్​కు చెందిన వ్యక్తి కో​-ఆప్షన్​ సభ్యుడిగా ఎన్నికవుతారని చెప్పారు. దీంతో కాంగ్రెస్​ నేతలు […]

Read More

పేకాటస్థావరంపై దాడి

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్​లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

మావోయిస్ట్​ అగ్రనేత గణపతి.. లొంగుబాటు

సారథి న్యూస్​, హైదరాబాద్​: మావోయిస్ట్​ కీలకనేత గణపతి అలియాస్​ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నట్టు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 74 ఏళ్ల గణపతి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. నడవడానికి వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉండడం అసాధ్యమని భావించి ఆయన లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆస్తమా, మోకాళ్లనొప్పి, డయాబెటిస్​తో గణపతి బాధపడుతున్నారు. ఆయనను అనుక్షణం ఇద్దరు సహాయకులుగా ఉంటున్నారట. […]

Read More

మారటోరియం మరో రెండేళ్లు

ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]

Read More

బాయ్‌ఫ్రెండ్‌తో నయన్​ ఎంజాయ్​

నయనతార ఇటీవల తన బాయ్​ఫ్రెండ్​ విఘ్నేశ్​ శివన్​తో కలిసి ఓనమ్​ పండుగను జరుపుకుంది. తన ప్రియుడితో కలిసి కొచ్చికి వెళ్లి అక్కడ ఓనమ్​ వేడుకల్లో పాల్గొన్నది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ పండుగలో పాల్గొనేందుకు నయన్​ చెన్నై నుంచి ఓ చార్టర్డ్​ ఫ్టైట్​ను బుక్​ చేసుకుని వెళ్లినట్టు టాక్​. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More