Breaking News

Day: August 26, 2020

నీట్​, జేఈఈ ఆపండి

నీట్​, జేఈఈ ఆపండి

ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్​ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ నీట్​, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]

Read More
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న సమయంలో.. రైతన్నలు కష్టకాలంలో ఉన్నవేళ కేంద్ర ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయరంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచింది.ప్రకటించిన మద్దతు ధరలువరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరతో కలుసుకుని రూ.1,868(పెంచిన ధర రూ.53), వరి(గ్రేడ్ ‘ఏ’ రకం) కొత్త ధర రూ.1,888, […]

Read More
ఆ ఎమ్మెల్యేకు ఎంత ధైర్యమో!

ఆ ఎమ్మెల్యేకు ఎంత ధైర్యమో!

సారథి న్యూస్, కర్నూలు: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. ఆ పేరు చెబితేనే అందరూ ఉలిక్కిపడే పరిస్థితి. కరోనాతో చనిపోయారని వింటేనే చాలు .. రక్తపంచుకు పుట్టినవారు, ఆప్తులు, బంధువులు, నా.. అనే వారు ఎవరూ ముందుకురావడం లేదు. కానీ ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. అందరిలోనూ ధైర్యం నింపేలా.. కరోనా భూతంపై అవగాహన కల్పించేలా ముందుకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్. కోవిడ్ బారినపడి మృతిచెందిన ఓ […]

Read More
పెండింగ్ కేసులు పరిష్కరించండి

పెండింగ్ కేసులు క్లియర్​ చేయండి

సారథి న్యూస్, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్​స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని, ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పోలీసు కమిషనర్లు, ఆయా జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్​ కేసులను సమీక్షించడం ద్వారా కేసులు సంఖ్య తగ్గించేలా కృషిచేయాలన్నారు. నిందితులకు శిక్షపడేలా కృషిచేసిన ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అభినందించారు. లాక్ డౌన్ వల్ల సైబర్ క్రైమ్ […]

Read More
కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ కార్యకర్త ఎంఎన్ శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గుంటూరుపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఓదార్చారు. ఆత్మహత్యకు పాల్పడిన శివారెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మృతుని కుమార్తెకు వైద్యసదుపాయం కల్పిస్తామని భరోసా కల్పిస్తామన్నారు.

Read More

నెమ్మదిగా కోలుకుంటున్న బాలు

చెన్నై: గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్​ తెలిపారు. కరోనాతో ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చేరిన బాలూ ఆరోగ్యం క్రమంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఎక్మా పరికరంతో కృత్రిమశ్వాసం అందిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, తెలంగాణలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందారు. ఆయన తొందరగా కోలుకోవాలని మృత్యుంజయ యాగాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం […]

Read More

67వేల కేసులు.. వెయ్యి మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నది. కొత్తగా 67,151 కొత్తకేసులు నమోదుకాగా.. 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. మృతుల 59,449 కు చేరింది. ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 24,67,759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొంది కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని […]

Read More

డ్రగ్​మాఫియాతో రియాకు లింక్

ముంబై: సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ఓ డ్రగ్​ డీలర్​తో జరిపిన వాట్సాప్​ చాటింగ్​ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సుశాంత్​ కేసులో డ్రగ్​ మాఫియా ప్రమేయం ఉన్నట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా చక్రవర్తి మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం […]

Read More