ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీట్, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]
న్యూఢిల్లీ: జేఈఈ, నీట్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జేఈఈ, నీట్‌ను వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం వారి పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలకవ్యాఖ్యలు చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వచ్చే […]
ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్‌టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను […]
ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్ వేశారు. స్టూడెంట్స్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్ డిజాస్టర్. […]
ఢిల్లీ: ఢిల్లీకి చెందిన అన్ని యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వార్షిక పరీక్షలు, ఇతర పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఆయా విశ్వవిద్యాలయాలు తమ నిబంధనల ప్రకారం విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తారని. లేదా వారికి డిగ్రీ పట్టా అందజేస్తారని […]
ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ప్రమోట్ పై క్లాసెస్‌కు 5,34,903 మంది స్టూడెంట్స్ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే స్టూడెంట్స్‌ను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పై […]
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని యూజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున లాక్‌డౌన్ విధించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. ఈ నిర్ణయంతో యూజీ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించి మూడులక్షల మంది, పీజీ ఫస్టియర్‌కు చెందిన 12వేల మంది స్టూడెంట్స్‌కు పరీక్షలు ఉండవు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పెన్ అండ్ పేపర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించడం వీలుకాదు. దీనికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు శనివారం రిలీజ్ చేశారు. జులై 1న పాలీసెట్, జులై 1 నుంచి 3వ తేదీ వరకు పీజీ సెట్, 4న తెలంగాణ ఈసెట్, 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10న లాసెట్, పీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో […]