Breaking News

పాజిటివ్

జనగామ ఎమ్మెల్యేకు కరోనా

జనగామ ఎమ్మెల్యేకు కరోనా

సామాజిక సారథి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా మొదటి వేవ్ లో కూడా ముత్తిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సతీమణి, గన్ మెన్, వంటమనిషి, డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు.

Read More
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

సామాజిక సారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాస్ హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Read More
మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు.  ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

Read More
మహేశ్బాబుకు కరోనా పాజిటివ్‌

మహేశ్​బాబుకు కరోనా పాజిటివ్‌

త్వరగా కోలుకోవాలని చిరంజీవి, ఎన్టీఆర్​ ట్వీట్‌ సామాజిక సారథి, హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అయితే నాతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్‌ తీసుకోలేదో […]

Read More
గోవా టూర్తోనే ముప్పు

గోవా టూర్​ తోనే ముప్పు

న్యూఇయర్‌ వేడుకలకు వెళ్లొచ్చిన వారికి కరోనా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కు వెళ్లిన 32 మందికి పాజిటివ్‌ తలలు పట్టుకుంటున్న అధికారులు జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​పాజిటివిటీ సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల ఎఫెక్ట్‌.. కారణంగా మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్​31న న్యూ ఇయర్‌ ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్​నగర వాసులు.. తిరిగి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పలువురు కొత్త ఏడాదికి సంబరాల కోసం గోవాకు వెళ్లారు. […]

Read More
ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ […]

Read More
వెంటాడుతున్న కరోనా

వెంటాడుతున్న కరోనా

నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్​ బాహుబలి నోరా ఫతేహికి కూడా పాజిటివ్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: కరోనా మరోసారి విజృభిస్తుంది. బాలీవుడ్‌ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్‌ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్‌ భామకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించే లోపు కేసులు […]

Read More
కరోనా కొత్తకేసులు

22 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లోనే 62,064 మందికి కొత్తగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. 6,34,949 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,077 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 2.45 కోట్ల పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది.

Read More