అమరావతి, సారథిన్యూస్: టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘నాకు కరోనా సోకింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కొన్నిరోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నా వద్దకు రావొద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అంటూ ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు […]
అమరావతి: వరుస ఎదురుదెబ్బలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంద్రబాబు, యువనేత లోకేశ్ మీద నమ్మకం లేక పలువురు కీలకనేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ […]
సారథిన్యూస్, అమరావతి: స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో నిందితుడు.. రమేశ్ ఆస్పత్రి యాజమాని డాక్టర్ రమేశ్ బాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో దాక్కొని ఉంటారని వైఎస్సార్సీపీ విజయ్‌సాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ […]
సారథిన్యూస్, రామడుగు: నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విఫలమయ్యారని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్ కోసం ఎందరో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయారని ఎమ్మెల్యే రవిశంకర్ కనీసం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం జోజిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జంగం అంజయ్య, గంగాధర మండల […]
సారథి న్యూస్, ఎల్బీనగర్ (హైదరాబాద్): కరోనా నుంచి ప్రజలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం ఎల్బీనగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ ఆఫీసు ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాచేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన […]
సారథి న్యూస్, వరంగల్: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షుడు చిటూరి అశోక్ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు […]
సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏంచేశారని, హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేసినందుకే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అన్నారు. రాష్ట్రంలో అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాన్న లక్ష్యంతో పోరాడుతున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కనీస జ్ఞానం కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ […]