సారథి న్యూస్, అనంతపురం: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబర్ 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. […]
సారథి న్యూస్, హుస్నాబాద్: దళితుల హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ నిరంతర పోరాటాలు చేస్తుందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జేపీ లత అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి ఏబీసీడీ వర్గీకరణకు పోరాడలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వృద్ధాప్య, వితంతువులు, వికలాంగుల పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు మంద కృష్ణ మాదిగ పోరాటాల ఫలితమేనన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటస్వామి, నాయకులు లక్ష్మీనారాయణ, […]
సారథి న్యూస్, బెజ్జంకి: రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూనే రేషన్ పంపిణీ చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. బెజ్జంకి ఎంపీడీవో ఆఫీసులో డీలర్లకు మంగళవారం కమిషన్ చెక్కులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత పాల్గొన్నారు.
‘నాయక్’ సినిమాలో చరణ్ తేజ్ పక్కన, ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీ పక్కన నటించిన అమలా పాల్ తెలుగులో అనుకున్నంత సక్సెస్‌ను సాధించలేకపోయింది. దీంతో తమిళం, మలయాళ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించి అక్కడ విజయాలను అందుకుంటోంది. అయితే ఇప్పుడు తెలుగులో ఓ మాంచి చాన్స్ అమలాపాల్ ను వరించిందట. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో అమలా హీరోయిన్ క్యారెక్టర్‌ను దక్కించుకుందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్ల నటించనుండగా ప్రధాన హీరోయిన్గా […]
రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీలో ఓ కీలకపాత్ర పోషించింది సీరత్ కపూర్. ఆమె క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. తన పాత్రల్లో గ్లామర్ ఏ మాత్రం తగ్గించని సీరత్ కపూర్ ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన సీరత్ ఆ తర్వాత వరుస గా ‘టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, ఒక్కక్షణం, టచ్ చేసి చూడు’ సినిమాల్లో నటించింది. ఎంత […]
సారథి న్యూస్, కర్నూలు: ఏపీలో మంగళవారం కొత్తగా 1,155 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 16,238 శాంపిళ్లను పరీక్షించగా 1,178 కరోనా కేసులు తేలాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 21,197కు చేరింది. తాజాగా 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్రంలో 252 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]
సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వరంగల్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా తగ్గడం లేదు. రాష్ట్రంలో మంగళవారం 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏడుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 313కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో 27,612 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.1,28,438 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్లో 32, నల్లగొండ 31, నిజామాబాద్‌లో 19 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. […]