Breaking News

RAMADUGU

పేద యువతికి ఎన్నారై సాయం

ఎన్​ఆర్​ఐ ఔదార్యం

సారథి న్యూస్, రామడుగు: పేద యువతి వివాహానికి సహాయంచేసి ఓ ఎన్​ఆర్​ఐ పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడ్డారు. తన సొంత గ్రామానికి చేతనైన సాయం చేస్తుంటాడు. రామడుగుకు చెందిన జిట్టవేని రజిత అనే యువతికి కొంతకాలం క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి సత్యం రూ.20వేల సాయం చేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్​ ప్రమీల జగన్​మోహన్​గౌడ్ కు పంపించగా ఆమె బాధిత యువతికి అందజేశారు. […]

Read More
కరోనా రామడుగు ఎమ్మార్వో

రామడుగులో కరోనా కలకలం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని శిక్షణా అధికారికి కరోనా సోకింది. దీంతో ఇటీవల తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లిన వారంతా ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని శానిటైజ్​ చేశారు. పరిసరాలను శుభ్రపరిచారు. రామడుగు మండలంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య​ అధికారులు సూచించారు. ఇటీవల రామడుగు తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లిన వారంతా హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.

Read More
ప్రకృతి వనం.. ఆహ్లాదభరితం

ప్రకృతివనం.. ఆహ్లాదభరితం

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె పకృతి వనం’ కార్యక్రమంలో గ్రామాలన్నీ ఆహ్లాదభరితంగా మారనున్నాయని పీడీ వెంకటేశ్వరరావు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్​ పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లెలను ఆహ్లాదభరితంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్​, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు […]

Read More
కరోనాపై ఇంత నిర్లక్ష్యమా

కరోనాపై ఇంత నిర్లక్ష్యమా

సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్​ బీసీసెల్​ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్​ విమర్శించారు. కరీంనగర్​ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్​, గంగుల కమాలాకర్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]

Read More

భూతగాదాలతో దాడులు

సారథి న్యూస్, రామడుగు: భూ తగాదాలు రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామానికి చెందని చెందిన కాసర్ల మనెమ్మ, గుర్రాల పద్మ తమ వ్యవసాయం పొలాన్ని ట్రాక్టర్​తో దున్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందని దొడ్డ శ్రీనివాస్​రెడ్డి, దొడ్డ సుధాకర్​రెడ్డి అక్కడికి వచ్చి ఈ పొలంలో తమకు వాటా ఉందంటూ మణెమ్మ, పద్మపై వ్యవసాయ పనిముట్లతో దాడిచేశారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి […]

Read More
రామడుగులో హరితహారం

అటవీ శాతాన్ని పెంచాలి

సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు తహసీల్దార్​ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్​ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్​ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, వివిధ […]

Read More

రామన్న జన్మదినం నిరాడంబరంగా

సారథి న్యూస్, నెట్​వర్క్​: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ జన్మదినం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విపత్తువేళ తగిన జాగ్రత్తలు పాటిస్తూ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్​ కట్​చేసి, నిరుపేదలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కేక్​ కట్​చేసి పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లాడలో మాజీ ఎస్సీ కార్పొరేషన్​ చైర్మన్​ పిడమర్తి రవి, […]

Read More

సేద్యంలో భారీ మార్పులు

సారథిన్యూస్, రామడుగు: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అలాగైతేనే అధికదిగుబడి సాధ్యమవుతుందని ఆత్మ పీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా కొరటిపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లో భాగంగా సాగునీటి విధానం, నీటి పొదుపు తదితర అంశాలపై రైతులకు శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మన్నే దర్శన్ రావు, శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ పీడీ […]

Read More