Breaking News

Day: July 24, 2020

పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలి

పల్లెలను నందనవనాలుగా తీర్చిదిద్దాలి

సారథి న్యూస్, మెదక్: పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెగిగ్రేషన్ పనులను త్వరగా పూర్తిచేయడంతో పాటు గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని ఆదేశించారు. నాటిన మొక్కలను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మెదక్ జిల్లాను ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా […]

Read More
ఇంటింటికీ వైద్యపరీక్షలు

ఇంటింటికీ వైద్యపరీక్షలు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా మెురుమూరు గ్రామపంచాయతీలో శుక్రవారం వాజేడు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించింది. అనంతరం ‘ప్రైడే డ్రైడే’ నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనివాస్, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు.

Read More
కేటీఆర్​కు అరుదైన కానుక

కేటీఆర్​కు అరుదైన కానుక

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అపురూపమైన కానుకను అందజేశారు. కేటీఆర్​ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం, కెరియర్ విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని వివరిస్తున్న దృశ్యమాలికలతో పెయింటింగ్​ వేయించారు. […]

Read More
‘బిచ్చగాడు 2’ ఫస్ట్ లుక్

‘బిచ్చగాడు 2’ ఫస్ట్ లుక్

మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ‘బిచ్చగాడు 2’ అనౌన్స్​మెంట్ పోస్టర్ విడుదల చేశారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నిర్మాతగా వస్తున్న ఈ సినిమా తమిళంలో ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో రూపొందనుంది. 2021లో ఈ సీక్వెల్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘నకిలీ, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విజయ్ ఆంటోని. శశి దర్శకత్వంలో […]

Read More
ప్రోటోకాల్ లొల్లి

ప్రోటోకాల్ లొల్లి

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మార్కెట్​చైర్మన్​ప్రమాణ స్వీకారం శుక్రవారం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అబ్రహం చేతులమీదుగా జరిపించారు. కార్యక్రమానికి పుల్లూరు గ్రామ సర్పంచ్ నారాయణమ్మను పిలువలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవి బాధ్యతల స్వీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా కార్యక్రమానికి సొంత పార్టీకి చెందిన జడ్పీటీసీ రాములమ్మ, ఎంపీటీసీ వరలక్ష్మి, ఎంపీపీని కూడా పిలువలేదు. దీంతో వారు కూడా కొంత మనస్తాపానికి […]

Read More
దుబాయ్​ బాధితుడికి చేయూత

గల్ప్​ బాధితుడికి చేయూత

సారథి న్యూస్, రామడుగు: సర్వస్వం కోల్పోయిన ఓ గల్ఫ్ బాధితుడికి దుబాయ్​ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అండగా నిలబడింది. ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలికి చెందిన అంధకూర్ లింగయ్య కొంతకాలం క్రితం ఓ ఏజెంట్​ సాయంతో దుబాయ్​ వెళ్లాడు. కానీ అతడికి అక్కడ పనిదొరకలేదు. దీంతో ట్రక్కుల మధ్యలో పడుకుంటూ.. యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సమన్వయకర్త గణేశ్​, సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య అతడికి ఉండటానికి వసతి […]

Read More
రేషన్​ బియ్యం పక్కదారి

రేషన్​ బియ్యం తరలిస్తూ చిక్కారు

సారథి న్యూస్​, ఖమ్మం: రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద 25 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్​ చేశారు. ఖమ్మంలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్​ కృష్ణ, రాము అనే వ్యక్తులు రేషన్​ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఖమ్మం అర్బన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని శ్రీరాములు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 18 […]

Read More
వర్మ ఈజ్ వర్మ

వర్మ ఈజ్ వర్మ

వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా అదొక సంచలనం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్​గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్​లో వర్మ చిత్రాలు చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే అతన్ని మాటలతో గెలవడం కూడా చాలా కష్టమే అంటున్నారంతా. తాజాగా వర్మ తీసిన ‘పవర్ స్టార్’ చిత్రం అనేక వివాదాలకు దారితీస్తోంది. గురువారం వర్మ ఆఫీస్ పై పవన్ ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. అలాగే వర్మ జీవితాన్ని బట్టబయలు […]

Read More