Breaking News

Day: July 25, 2020

జనజీవన స్రవంతిలో కలవండి

జనజీవన స్రవంతిలో కలవండి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): మావోయిస్టులు వారోత్సవాల పేరుతో బంద్ లు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, వారికి సహకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోవడంతో ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన అందకుండా పురోగతికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడకుండా […]

Read More
కరోనా నియంత్రణలో విఫలం

కరోనా నియంత్రణలో విఫలం

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం కాంగ్రెస్​ నేతలు హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ​ప్రభుత్వం ఆరేళ్లలో వారసత్వ కట్టడాల మరమ్మతులకు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కొత్త భవనం నిర్మాణానికి ఉస్మానియా ఆస్పత్రి వెనుక ఆరెకరాల విస్తీర్ణంలో స్థలం […]

Read More
వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కె.తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఫ్లోరింగ్ సొల్యూషన్స్, కార్పెట్ టైల్స్, గ్రీన్స్(కృత్రిమ గడ్డి), బ్రాడ్‌లూమ్ తివాచీలు (వాల్ టు వాల్ కార్పెట్)లను తయారుచేసేందుకు యూనిట్​ సిద్ధమైంది. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని మంత్రి కేటీఆర్​అన్నారు. ఈ పారిశ్రామిక క్లస్టర్‌లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా […]

Read More

దళిత యువకుడి హత్యోదంతంపై విచారణ

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం మర్రిపల్లిలో ఇటీవల దళిత యువకుడు కిరణ్ హత్యకు గురయ్యాడు. హత్యకు దారితీసిన ఘటనను సంబంధించిన వివరాలను శనివారం ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ తెలుసుకున్నారు. ఈ హత్యోదంతంపై న్యాయవాదులతో చర్చించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే వారితో మాట్లాడారు. ‘మాదిగ యువకుడు కిరణ్ హత్య కేసులో ఏసీపీ, సీఐ, రైటర్ కూడా నిందితులే, నిందితులకు సహకరించిన వారిని వదిలిపెట్టం. పోలీస్ అధికారులే ఉద్దేశపూర్వకంగా […]

Read More
సుశాంత్ చివరి చిత్రం.. రేటింగ్స్​ అదుర్స్​

సుశాంత్ చివరి చిత్రం.. రేటింగ్స్​ అదుర్స్​

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఎందరికో బాధను మిగిల్చింది. మరికొందరు బంధుప్రీతి అంటూ ఆయన మరణం వెనక చాలా కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు కూడా. సుశాంత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటే అయినా మరణానికి ముందు సుశాంత్ హీరోగా సంజా సంఘీ హీరోయిన్ గా ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో ‘దిల్ బేచారా’ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా నిన్న డిస్నీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే […]

Read More
‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్​లైన్​లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.

Read More
ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

సారథి న్యూస్, ఖమ్మం: క్రీడల్లో రాణించేలా ప్రతిరోజు సాధన చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. హైదరాబాద్ సిటీ, నిజామాబాద్​కు చెందిన 217 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఖమ్మం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏడునెలలుగా ట్రైనింగ్​ తీసుకుంటున్నారు. వారి మధ్య స్ఫూర్తిని పెంపొందించేలా రెండురోజుల పాటు ఖమ్మం సిటీపోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ తఫ్సీర్ ఇక్బాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. […]

Read More
ఓపెస్​స్కూలు స్టూడెంట్స్​పాస్​

ఓపెస్ ​స్కూల్​ స్టూడెంట్స్ ​పాస్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియట్​ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అందరికీ 35 మార్కులు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా దృష్ట్యా ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరవర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదన […]

Read More