Breaking News

RAINS

అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు మద్దతు ధర కోసం పడిగాపులు నిండా ముంచుతున్న మిల్లర్లు  సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు […]

Read More
మరో మూడురోజులు వర్షాలు

మరో మూడురోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం వాతావరణశాఖ వెల్లడి సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే మరో ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో నిక్షిప్తమైందని వెల్లడించింది. తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రెండు […]

Read More

దూసుకొస్తున్న వాయుగుండం.. రెండ్రోజులు వర్షాలు

సారథిన్యూస్​, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కోస్తాఆంధ్ర వైపు దూసుకొస్తున్నది. అయితే మరో 12 గంటల్లో అతి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ […]

Read More

నాలుగేండ్ల తర్వాత..

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ శివారు లోని సోమాజిచెరువు నాలుగేండ్ల తర్వాత అలుగుపారడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చెరువు మత్తడి దుంకింది. దీంతో పిల్లలు, యువకులు అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాలవారు అక్కడికి చేరుకొని చెరువు అందాలను తిలకించారు.

Read More

బొంకూర్ పెద్దవాగు.. ఉధృతం

సారథిన్యూస్​, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.

Read More

జోరువాన.. నిండా ముంచింది

సారథిన్యూస్, రామడుగు: ఇటీవల కొంతకాలంగా కురుస్తున్న భారీవర్షాలు రైతాంగాన్ని నిండా ముంచాయి. ఈ జోరువానతో ఇప్పటికే పలుచోట్ల పాతమిద్దెలు కూలిపోయాయి. పలువురు గాయపడ్డారు. వరదతాకిడికి కొందరు గల్లంతయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. గాంకుంట్ల చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతంలో స్కూలు నిర్మాణం చేపట్టడంతో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. కరోనా లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదు. రోజు ఆన్​లైన్​ తరగతుల నిర్వహణ కోసం […]

Read More

వరదబాధితులను ఆదుకోండి

సారథి న్యూస్​, రామడుగు: వర్షంతో నష్టపోయిన రైతన్నలు వెంటనే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కొయ్యడ సృజన్​ కుమార్​ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గంటే రాజేశం, మచ్చ రమేశ్​, బాల్ రెడ్డి, నాగి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

సారథి న్యూస్​, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్​ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్​ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ […]

Read More