Breaking News

 71 వాహనాలు సీజ్  

71 వాహనాలు సీజ్

సామాజిక సారథి, సుల్తానాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనాలు పాటించకుండా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తొలగించి తీరుతున్న 71వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబరుప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబరుప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నెరమన్నారు. అలాంటి వాహనాలను గుర్తించి సీజ్‌ చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పెద్దపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రతినిత్యం వాహనాల తనిఖీతోపాటు బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మద్యంసేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష పడుతుందని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు ఉపేందర్‌, వినితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.