సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్‌బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గత శనివారం నీటిఉధృతిలో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీసీ మహేందర్ పరిశీలించారు.బస్వాపూర్ గ్రామస్తుల చేయూతలారీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయమందించానే సంకల్పంతో బస్వాపూర్ గ్రామానికి చెందిన […]
సారథి న్యూస్, హుస్నాబాద్: వాగు నీటిలో కొట్టుకుపోయిన లారీడ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. చివరికి ఆచూకీ లభించకపోడంతో వెనుదిరిగాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారుజామున వరంగల్లు వైపునకు లారీ(టీఎస్ 02 యూబీ 1,836) వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముదిమడక శంకర్(37) ఎప్పటిలాగే వెళ్లేందుకు ప్రయత్నించగా లారీ ఒక్కసారిగా […]
సారథిన్యూస్, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పల్లెచెరువు, మాదిగవాని కుంట, కొత్తచెరువు, పందిల్ల, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, మల్లంపల్లి, నక్కలకుంట, తాళ్లచెరువు, కొహెడ మండలంలోని బస్వాపూర్, శనిగరం, బెజ్జంకి మండలం బేగంపేట పాతచెరువు, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, ముత్తన్నపేట, మద్దూర్ మండల పరిధిలోని కుటిగల్, గాగిళ్లపూర్, బైరాన్‌పల్లి గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, […]
ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు, 128 పంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్ లో […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గిరిజన మహిళా ఎంపీటీసీని కులంపేరుతో దూషించడమే కాక.. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కపూర్ నాయక్ తండా సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 11న గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీటీసీ బానోత్ ప్రమీలను సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ భర్త మరి కొంత మంది అసభ్య పదజాలంతో దూషించడమే కాగా […]
సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలం పందిల్ల, జనగాం గ్రామాల్లో రైతు వేదికలకు భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. దేశానికే వెన్నెముకయిన అన్నదాతల్లో నూతన వ్యవసాయ విధానాలు అమలు కావడానికి ఈ వేదికలు తొడ్పతయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు మానన, లక్ష్మి, జడ్పీటీసీలు […]