Breaking News

Day: August 20, 2020

భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు

భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం ఎప్పటికీ కాదని సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారం స్పష్టంచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారని, ఇస్రో ప్రైవేట్​పరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను.. అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేట్​వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు […]

Read More
అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

సారథి న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్​7 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతో కలిసి గురువారం పరిశీలించారు. అసెంబ్లీ, శాసనమండలిలో భౌతికదూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను […]

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్​, రామగుండం: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ నేతలు కనకరాజ్, యాకయ్య, నరేశ్​ డిమాండ్​ చేశారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామగుండం ప్రభుత్వాస్పత్రిని సీపీఐ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసవసతులు లేవని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు వైవీ రావు, మద్దెల దినేశ్​, తోకల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునక

శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునక

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో గురువారం సాయంత్రం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు సమీపంలోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ నీటిలో మునిగిపోయింది. కల్లేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.లాంచీ సిబ్బంది రాంబాబు, సత్తిబాబు, పెంటయ్య నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న మరో లాంచీ సిబ్బంది ఇద్దరినీ రక్షించారు. వీరిలో పెంటయ్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గోదావరి లాంచీ సిబ్బంది మాత్రమే ఉండడంతో ఘోర ప్రమాదం తప్పినట్లయింది.

Read More

కరోనా నియంత్రణలో విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గంలో తెగిన చెరువులు, చెక్ డ్యాంలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, వనేష్, హన్మిరెడ్డి, సుదర్శన్, […]

Read More

రాజీవ్ సేవలు చిరస్మరణీయం

సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్​ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, […]

Read More
31వరకు లాక్​డౌన్​

పెద్దశంకరంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్​హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్​, తహసీల్దార్​, ఎస్సై, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్​ ఉపాధ్యక్షడు […]

Read More
హైదరాబాద్ బెస్ట్ మెగాసిటీ

హైదరాబాద్ బెస్ట్ మెగాసిటీ

సారథి న్యూస్​, హైదరాబాద్: పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షన్- 2020 అవార్డులను కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) బెస్ట్ మెగాసిటీగా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఇక పరిశుభ్రమైన నగరంగా దేశంలోనే ఇండోర్ పట్టణం తొలిస్థానంలో నిలవగా గ్రేటర్ హైదరాబాద్ 23వ స్థానంలో నిలిచింది. గతేడాది హైదరాబాద్ 35 స్థానంలో నిలవగా, ఇప్పుడు ముంబై, బెంగళూర్ నగరాలను దాటి హైదరాబాద్ […]

Read More