అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతున్నదని సీపీఐ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ నేతలు కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చినవారిలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్, నాయకులు టీ మల్లయ్య, కే రాజారత్నం, టీ రమేశ్ కుమార్, రేణిగుంట ప్రీతం, […]
సారథి న్యూస్ శ్రీకాకుళం: కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయబిల్లు పేద రైతులకు గుదిబండ లాంటిదని.. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఐ శ్రేణులు ఆందోళకు దిగాయి. ఈ దీక్షలో సీపీఐ నేతలు బుడితి అప్పలనాయుడు, మన్మధరావు, ద్వారపూడి అప్పలనాయుడు, కూరంగి గోపినాయుడు సీతమ్మ ఆరిక హరిబాబు,టొంపల ఆదినారొయణ,ఊయక వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చేర్యాల పట్టణంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయన్నారు. రహదారి వెంట అక్రమార్కులు నాలాలను కబ్జా చేయడం ద్వారా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మున్సిపల్ అధికారులు, పాలకమండలి సభ్యులు నాలాలను క్లీన్ చేయడం, కబ్జాలకు గురైన స్థలాలను […]
సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీఎన్ జీఎం ఆఫీసు ఎదుట నిరాహారదీక్షలు చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, వి.సీతారామయ్యతో పాటు సీపీఐ నాయకులు జి గోవర్ధన్, కె.కనకరాజు దీక్షలను ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం కరోనా పేరుతో సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు తన రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాలు తీసుకొస్తే యజమాన్యం లాభాలు ప్రకటించకుండా రాష్ట్ర […]
సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెగిన చెరువులు, చెక్ డ్యాంలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, వనేష్, హన్మిరెడ్డి, సుదర్శన్, […]
సారథి న్యూస్, రామగుండం: సీపీఐ నేత ఎం.నారాయణ.. నిజాయితీకి మారుపేరు అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కొనియాడారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని భాస్కర్రావుభవన్లో ఎం.నారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు వారు హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, యూనియన్ […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్ పాల్గొన్నారు.