దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన 29వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ బ్యాట్స్మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్మెన్లు సామ్ కరాన్(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, […]
స్వీటీ అనుష్క సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ఎప్పటికప్పడు ఫ్యాన్స్‌తో విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతున్నది. రీసెంట్గా నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇన్‌స్టాలో అనూష్కను ఫాలో అయ్యేవారి సంఖ్య 4 మిలియన్లకు చేరిందట. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది స్వీటీ. ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు మంగళవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఐదు సవరణలు చేసిన బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.ఐదు సవరణలు ఇవే1.మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేషన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత కేసు గంటగంటకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు అజయ్ వేధింపులు భరించలేకే శ్వేత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల వాదన మరోవిధంగా ఉంది. తమ కూతురును అజయ్ హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు ఇప్పటికే అజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నేపథ్యం ఇదీ.. హైదరాబాద్‌లోని మేడిపల్లికి చెందిన శ్వేత.. హైటెక్ సిటీలోని […]
హైదరాబాద్: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సారథి న్యూస్, రామగుండం: ఉద్యోగులంతా సమష్టిగా కలిసి పనిచేసి బొగ్గు ఉత్పాదక పనులను వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం 11వ బొగ్గు గనిలో కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సంబంధించి జీఎం నారాయణ, గని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 11 గ్రూప్ ఏజెంట్ మనోహర్, మేనేజర్ నెహ్రూ, గ్రూప్ ఇంజనీర్ రామదాసు, సర్వే అధికారి నారాయణ, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, జెమ్ కో ప్రాజెక్ట్ […]
సారథి న్యూస్, చొప్పదండి: అక్రమ ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని, అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి స్టేజ్ వద్ద సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆగమేఘాల మీద మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. […]
సారథి న్యూస్, ములుగు: ఓ నిరుపేద యువతికి మహిళా అధికారి సాయం అందించారు. తిండిలేక అల్లాడిపోతున్న యువతి మంగళవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ రూ.మూడువేలు, 25కేజీల బియ్యం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మురారి సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. తండ్రి పిల్లలను పట్టించుకోకపోవడంతో […]