టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటికి అధికారులు నోటీసులు జారీచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కృష్ణానదికి వరద భారీగా వస్తుండటంతో చంద్రబాబు ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. కొంతకాలంగా ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల దాటికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు […]
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేశారు. […]
సారథి న్యూస్, కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఆపాలని ప్రయత్నిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూ సిటీ కార్యదర్శి కె.సుధాకరప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ముజఫర్ నగర్ మట్టి పని అడ్డాలో జీవోనం.17 కాపీలను మాజీ కార్పొరేటర్ బి.సోమన్న మహిళా సంఘం నాయకురాలు ఎస్.ఓబులమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కె.సుధాకరప్ప, బి.సోమన్న మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ నిధికి రూ.450 కోట్లు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈనెల […]
సారథిన్యూస్ రామగుండం: ‘ప్రపంచం మొత్తం గాలించి చూసినా కేసీఆర్ లాంటి రాజకీయనేత మనకు కనిపించరు. ఆయన పనితీరు నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్! అన్నట్టుగా కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన పల్లి వద్ద జిల్లా గొర్రెల, మేకల మార్కెట్ కు భూమి పూజ చేశారు. అనంతరం గోదావరిఖనిలోని సమ్మక్క సారక్క గద్దెల సమీపంలో […]
ఢిల్లీ: గత కొంతకాలంగా సొంతపార్టీపై నిప్పులు చెరుగుతున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారు. కానీ అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు? న్యాయవ్యవస్థనే తూలనాడేలా ధర్నాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డికి […]
సారథి న్యూస్, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్‌కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్‌గా పేరు ఉండేది. […]
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం […]
సారథి న్యూస్, కర్నూలు: రెండు నెలల్లో కర్నూలు, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమవుతాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఎయిర్ పోర్ట్ ను అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు. పెండింగ్ ఉన్న 17 రకాల పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సూచించారు. […]