సారథిన్యూస్, రామడుగు: బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి అమానుషమని చొప్పదండి నియోజవర్గ బీజేపీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నాయకులు పొన్నం శ్రీను, పోచంపల్లి నరేశ్, కల్లెం శివ, వెంకటేశ్, అజయ్, […]
న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్ ఎటాక్స్ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్ రాయ్ పేర్కొన్నారు. అయితే చైనా –ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ‘పిషింగ్, రాన్సమ్‌వేర్ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివన నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. టెన్షన్ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు’ అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్ కంప్యూటర్స్‌లో కూడా అప్లికేషన్లు డౌన్‌లోడ్ […]
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన రౌడీ షీటర్ వికాస్ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్ ఘోష్ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్‌వాక్‌కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి […]
శ్రీనగర్: కశ్మీర్‌లోని సొపోర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న వేళ.. ఉగ్రమూకలు భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సారథిన్యూస్, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు డేరంగుల నర్సింహపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. పొల్కంపల్లి గ్రామంలోని ఓ భూవివాదం గురించి మాట్లాడటానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత నర్సింహపై.. సీపీఎం కార్యకర్తలు విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దాడిలో నర్సింహ గాయపడగా అతడిని ఇబ్రహీంపట్నంలోని ఓ దవాఖానకు తరలించి చికిత్సనందిస్తున్నారు. టీఆర్ఎస్ నేతపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీటీసీలు రవీందర్, శ్రీశైలం, కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫ్, […]
సారథి న్యూస్ నారాయణఖేడ్: మహిళా ఎంపీటీసీపై దాడి జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకున్నది. దెగుల్ వాడి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సుశీలమ్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ మెంబర్ కుపేందర్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. మహిళా అన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి దాడి చేసినట్లు ఎంపీటీసీ సుశీలమ్మ ఆరోపించారు. సొయా విత్తనాల కోసం రైతులకు టోకెన్లు అందిస్తున్న సమయంలో మాటమాట పెరిగి దాడికి దారి […]