సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన కరోనా అనుమానితలు పరీక్షల కోసం ఇకనుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో ఖమ్మం జిల్లాకేంద్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఖమ్మంలో కరోనా పరీక్షలు చేయాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను కోరగా అందుకు ఆయన అనుమతించారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్ వో సూచనలు పాటించకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయనన్నారు. చావుకు ఎదురు నిలిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సారథిన్యూస్, వరంగల్ అర్బన్: సకాలంలో పనులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా లో వైకుంఠ దామాలు, కంపోస్టు ( సెగ్రిగేశాన్) షెడ్లు నిర్మాణా పనులను జూలై చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరిత హరంలో భాగంగా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ శివారు ఆయన మాట్లాడారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. బర్త్‌డే, పెండ్లి రోజు, ఇతర శుభదినాల్లో మొక్కలు నాటాలని కోరారు. బుధవారం కోహెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించడంతో పర్యావరణం రోజురోజుకు కలుషితమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: వర్షాలు కురవాలని గ్రామస్తులు, రైతులు బుధవారం మండలంలోని మాలపల్లిలో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. సర్పంచ్ బత్తల మల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు పెట్టి రోజులు దాటినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకంతో పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఆంజనేయస్వామి విగ్రహాలకు జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్మున్సిపాలిటీలో వీధికుక్కలు కాలనీవాసులు, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని, వాటిని వెంటనే తరలించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ బుధవారం మున్సిపల్ అధికారులను కోరారు. పందులు, కుక్కలను తరలించాలని గతంలో తీర్మానించినా అది కాగితాలకే పరిమితమైందన్నారు. సీజనల్ వ్యాధుల విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డులో దోమల మందు పిచికారీ చేయాలని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకేరోజు 1018 పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు పాజిటివ్‌కేసులు 17,357 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్‌కేసులు 9008 ఉన్నాయి. తాజాగా 8082 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి ఏడుగురు మృతి, ఇప్పటివరకు 267 మంది మృత్యువాతపడినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌ను పేర్కొంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 881 కేసులు, రంగారెడ్డి 33, మేడ్చల్‌జిల్లాలో 36, మహబూబ్నగర్జిల్లాలో […]