Breaking News

ARREST

రియా చక్రవర్తి అరెస్ట్​

ముంబై: సుశాంత్​ రాజ్​పుత్​ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్​సీబీ ( నార్కొటిక్​ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్​ చేసింది. రియా అరెస్ట్​ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్​ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్టు ఎన్ సీబీకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మూడురోజుల పాటు ఎన్​సీబీ రియాను విచారించింది. ఆమె సోదరుడు షోవిక్​ చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్​ […]

Read More

పేకాటస్థావరంపై దాడి

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్​లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

దొంగలముఠా దొరికిందిలా..

సారథి న్యూస్​, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్​ పీఎస్​ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్​షాప్​లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]

Read More
పూలే విగ్రహ ధ్వంసం సరికాదు

పూలే విగ్రహధ్వంసం హేయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: వరంగల్ లో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి మాదిగ డిమాండ్ చేశారు. మురికివాడల్లో నివసించే పేద వారి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యను అందించిన ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే అన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

Read More
కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

సారథిన్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి బయలుదేరిన కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వేలూరు గ్రామంలో నర్సింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నర్సింహులు చెందిన 13 గుంటల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నదని.. అందుకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేలూరు బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని, కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. కాంగ్రెస్​ […]

Read More

‘కిక్​’ శ్యామ్​ అరెస్ట్​

కిక్​ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన నటుడు శ్యామ్​ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోడంబాక్కంలో శ్యామ్​ పోకర్​ క్లబ్​ను నిర్వహిస్తున్నాడు. ఈ క్లబ్​ను అతడు గ్యాంబ్లింగ్​ చేస్తూ పలువురిని మోసగించినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు శ్యాంను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం, ఊసరవెల్లి , కత్తి, వంటి సినిమాలో శ్యాం నటించాడు. ఇతడు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

Read More
భారీగా అక్రమ మద్యం పట్టివేత

భారీగా అక్రమ మద్యం పట్టివేత

సారథి న్యూస్​, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్​పోస్ట్​ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని  తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు  జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్​ఈబీ ఏఎస్​పీ కరీముల్లా షరీఫ్​ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని […]

Read More

మావోయిస్టుల పేరుతో బెదిరింపు

సారథిన్యూస్​, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్​ హెచ్​ఆర్​ మేనేజర్​కు ఫోన్​చేసి డబ్బులు డిమాండ్​ చేశారు. దీంతో మేనేజర్​ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read More