సామాజికసారథి, నాగర్ కర్నూల్: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని మాదిగ ఐక్యవేదిక వ్యవస్థపాకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్ అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మాదిగ జేఏసీ నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల నాగర్ కర్నూల్ లో జరిగిన మాలల సభలో ప్రజలను తప్పుదోవపట్టించేలా నాయకులు మాట్లాడారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే […]
ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం సామాజికసారథి, నాగర్ కర్నూల్: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్ బంద్ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని […]
మనువాదుల పార్టీ నుంచి బయటికొచ్చి మాట్లాడు నాగర్ కర్నూల్ గడ్డ.. మహేంద్రనాథ్ అడ్డా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజుపై బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ హెచ్చరించారు. ధర్మం తప్పితే మీలాంటి వారికి యమధర్మరాజే అవుతారని హితవు […]
సామాజిక సారథి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. విద్యానగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు చౌటి ప్రభాకర్, అనిల్ తదితరులు ఉన్నారు.
సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, వీహెచ్పీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చేసిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మరోసారి […]
సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి […]
సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన […]
సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా […]