సామజిక సారథి, ములుగు ప్రతినిధి: వ్యవసాయంపై మక్కువతో ఎప్పటిలాగే సెలవు రోజున సెల్క పనికి వెళ్ళారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా మాన్ సింగ్ తాండ పరిధి, భాగ్యతండాలో అలవాత్ బధ్యా, భుల్లి దంపతుల పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి (ఏరారు ) తీశారు. ఒక సాధారణ వ్యక్తిలా కూలీలతో కలిసి అన్నం తిన్నారు. ఎండనక, వానానక కాయకష్టం చేసుకొనే కర్షకులకు బాసటగా నిలుద్ధామని ములుగు,భూపాలపల్లి […]
సామాజిక సారథి, మధిర: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ లో ఓ కొండముచ్చు హల్ చల్ చేస్తోంది. శుక్ర, శనివారాల్లో ఓ కొండముచ్చు 8మందిపై దాడి చేసి గాయపరిచింది. ఓ కొండముచ్చు రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం కొండముచ్చు దాడిలో ఐదుగురు గాయపడగా, శనివారం రాత్రి ఓ కానిస్టేబుల్, రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేయడంతో పట్టాలపై పడి గాయాల పాలయ్యాడు. […]
సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]
– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే […]
సామాజిక సారథి, హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లా సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ జిల్లా రాంఘడ్ ప్రాంతానికి చెందిన జఫ్రూ డీన్ తన స్వగ్రామంలోనే గ్యాస్ గోడౌన్ లో డెలవరీ బాయ్ గా పనిచేసస్తున్నాడన్నారు. నిందితుడు […]
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ విజయ నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40)మహారాష్ట్ర అభయ్ విలాస్ యవాత్మల్ జిల్లా కు చెందిన అభయ్ విలాస్ రావు పెట్కర్ సోమవారం హన్మకొండ కేయూసీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.5 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలు ఏటీఎం […]
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థుల కోసం ఓ కళాశాలకోసం దానం చేసిన స్థలంలో ప్రస్తుతం కబ్జాకోరులు కన్నుపడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణ లోపల అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజల సంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. […]
సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు.