Breaking News

ఆన్ లైన్ బెట్టింగ్..ఇద్దరి అరెస్టు

ఆన్ లైన్ బెట్టింగ్..ఇద్దరి అరెస్టు

 సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ విజయ నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40)మహారాష్ట్ర అభయ్ విలాస్ యవాత్మల్ జిల్లా కు చెందిన అభయ్ విలాస్ రావు పెట్కర్ సోమవారం హన్మకొండ కేయూసీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.5 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. మాడిశెట్టి ప్రసాద్ అను నిందితుడు కోన్ని ఏండ్లుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోని రెడీమెడ్ బట్టల వ్యాపారం నిర్వహించుకోనేవాడన్నారు. ఈ బట్టల వ్యాపారం ద్వారా తన కుటుంబ పోషణ కష్టం కావడంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనికుని, అభయ్ అను వ్యక్తిని పరిచయం చేసుకొని ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు సోమవారం ఉదయం ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా కేయూసీ పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. అప్రమత్తమైన ఇన్స్ స్పెక్టర్ జనార్దన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ పాసుబుక్స్, ఏటీఎం కార్డులు, సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీఎస్పీ పుష్పారెడ్డి, హన్మకొండ ఎస్పీ జితేందర్ రెడ్డి, కేయూసీ ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఎస్ఐ సంపత్, ఏఏవోలు ప్రశాంత్, సల్మాన్‌షా, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు అశోక్, మధు, జగదీష్, కమాలకలను పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.