Breaking News

భారీ యంత్రాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు

భారీ యంత్రాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు

సామాజిక సారథి, హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లా సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ జిల్లా రాంఘడ్ ప్రాంతానికి చెందిన జఫ్రూ డీన్ తన స్వగ్రామంలోనే గ్యాస్ గోడౌన్ లో డెలవరీ బాయ్ గా పనిచేసస్తున్నాడన్నారు. నిందితుడు వరంగల్ లో జేసీబీని డ్రైవర్లగా పనిచేయడంతో పాటు జేసీబీని కిరాయిలకు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని తన మిత్రుల ద్వారా తెలుసుకున్నాడని తెలిపారు. వరంగల్ నగరంలో జఫ్రూడీన్ ఒక జేసీబీని చోరీ చేసి, ఇతరులకు అమ్మితే వచ్చిన డబ్బుతో జల్సా చేయెవొచ్చని నిర్ణయించుకున్నాడని తెలిపారు. జనవరి 13వ తేదీన రాత్రి 7.30 గంటలకు వడ్డేపల్లి చర్చి ప్రాంతంలో పార్కింగ్ చేసివున్న టీఎస్ 36 ఈ 2422 నెంబర్ గల జీసీబీని నిందితుడు చోరీ చేసి హన్మకొండలోని హంటర్ రోడ్డు ప్రాంతంలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుకున్నట్లు సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్  తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసిన జేసీబీని స్వాధీనం చేసుకున్నాట్లు పోలీసులు పేర్కొన్నారు.