పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
సారథి న్యూస్, రామడుగు: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. కరోనా వచ్చిందని రోగుల వివరాలు బయటపెడితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ కేసులో మహారాష్ట్ర, బీహార్ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]
సారథిన్యూస్, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేసినట్టు […]
ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్ గంజ్‌కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్ ఓ పోలీస్‌ను రివాల్వర్‌తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
సారథి న్యూస్, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్ రెడ్డి (32) భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]
సారథి న్యూస్, రామడుగు: భూ తగాదాలు రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామానికి చెందని చెందిన కాసర్ల మనెమ్మ, గుర్రాల పద్మ తమ వ్యవసాయం పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందని దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి, దొడ్డ సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చి ఈ పొలంలో తమకు వాటా ఉందంటూ మణెమ్మ, పద్మపై వ్యవసాయ పనిముట్లతో దాడిచేశారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి […]
ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు, 128 పంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్ లో […]