సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్‌పల్లి చెక్‌డ్యాం అలుగు పారుతోంది. బండర్‌పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్‌రావు చొరవతో చెక్‌డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్‌రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
సారథి న్యూస్, నెట్వర్క్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విపత్తువేళ తగిన జాగ్రత్తలు పాటిస్తూ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్‌చేసి, నిరుపేదలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కేక్ కట్‌చేసి పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లాడలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, […]
సారథిన్యూస్, చొప్పదండి: విద్యార్థులే తెలంగాణ సంపద అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో ఛైర్మన్ మల్లారెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రవణ్, తోట శేషాద్రి, మాచర్ల వినయ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు కరోనా సోకినట్టు సమాచారం. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే ఎమ్మెల్యేకు కరోనా సోకి ఉంటుందని ఆయన కుటుంబసభ్యలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని.. లక్షణాలు కూడా ఎక్కువగా లేవని […]
సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్ ఆరోపించారు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై దాడిని ఆప్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఓ మహోద్యమంలా సాగుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, తల్లపల్లి సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి […]