Breaking News

Day: July 2, 2020

జూరాల.. కళకళ

జూరాల.. కళకళ

సారథి న్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటిఉద్ధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతోంది. గతేడాది జులైతో పోలిస్తే నీటి నిల్వ గరిష్ఠంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి. 2019లో ఇదే సమయానికి 1.75 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 5.638టీఎంసీల నీటి నిల్వ […]

Read More
రికార్డు స్థాయిలో కరోనా కేసులు

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి ఎంత మాత్రం ఆగడం లేదు. ష్ట్రంలో అత్యధికంగా గురువారం ఒకేరోజు 1,213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 18,570 కు చేరాయి. తాజాగా 8 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటి వరకు వ్యాధిబారినపడి 275 మంది చనిపోయారు. 987 మంది రోగులు డిశ్చార్జ్​ అయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 998 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ 54, ఖమ్మం 18, వరంగల్ […]

Read More
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్​రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి జూన్ 30 నాటికి ముగిసిందని, మరో మూడునెలల పాటు పెంచుతున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్​ 30వ తేదీ వరకు కొత్త కార్డులను జారీచేయడం లేదా, కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మరోసారి కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత జిల్లా సమాచార పౌర […]

Read More
చెత్తబుట్టలు ఏర్పాటుచేసుకోవాలి

చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్​ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల చేత ప్రతి ఇంటిలో నుంచి చెత్తను సేకరించాక ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ ను స్కాన్‌ చేయించాలని కమిషనర్‌ డీకే బాలాజీ శానిటరీ ఇన్​స్పెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని కృష్ణానగర్‌, మద్దూర్‌ నగర్‌, అశోక్‌ నగర్‌, వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి దుకాణం వారు కచ్చితంగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కమిషనర్​వెంట […]

Read More

ఖమ్మం టీఆర్​ఎస్​ ఆఫీస్​ ఇంచార్జిగా కృష్ణ

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయం ఇంచార్జిగా ఆర్​జేసీ కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ గురువారం నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణను మంత్రులు కేటీఆర్​, అజయ్​ అభినందించారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

Read More

వరిలో మొగిపురుగును అరికట్టండిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్​ లేదా కార్టప్​హైడ్రోక్లోరైడ్​ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.

Read More

ప్రగతిపథంలో తెలంగాణ

సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి […]

Read More
నల్లబెల్లం పట్టివేత

నల్లబెల్లం పట్టివేత

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో నల్లబెల్లం విక్రయిస్తున్నారనే సమాచారంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.10 లక్షల విలువ చేసే 8,850 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Read More