Breaking News

ఏపీ

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Read More

కరోనాతో హాస్యనటుడు మృతి

తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్​.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్​ […]

Read More
కార్మికుల సంక్షేమనిధికి రూ.450 కోట్లు జమచేయాలి

కార్మికుల సంక్షేమనిధికి రూ.450 కోట్లు జమచేయాలి

సారథి న్యూస్, కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఆపాలని ప్రయత్నిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూ సిటీ కార్యదర్శి కె.సుధాకరప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ముజఫర్ నగర్ మట్టి పని అడ్డాలో జీవోనం.17 కాపీలను మాజీ కార్పొరేటర్ బి.సోమన్న మహిళా సంఘం నాయకురాలు ఎస్.ఓబులమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కె.సుధాకరప్ప, బి.సోమన్న మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ నిధికి రూ.450 కోట్లు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈనెల […]

Read More

బొంకూర్ పెద్దవాగు.. ఉధృతం

సారథిన్యూస్​, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.

Read More

అందరి జాతకాలు బయటపెడతాం

తాడేపల్లి: ‘అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ స్కామ్​లో ఉన్నారు. అమరావతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాం. సీబీఐ విచారణతో అందరిజాతకాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్​సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఫైబర్ గ్రిడ్ పేరుతో […]

Read More

లారీతో తొక్కించి చంపుతామంటున్నారు

సారథిన్యూస్​, అమరావతి: జగన్​ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్​సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్​ […]

Read More

బుద్దా వెంకన్నకు కరోనా

అమరావతి, సారథిన్యూస్​: టీడీపీ ఫైర్ బ్రాండ్​, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్​ చేశారు. ‘నాకు కరోనా సోకింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు. కొన్నిరోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నా వద్దకు రావొద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అంటూ ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు […]

Read More

రమేశ్​ ఆస్పత్రి చుట్టూ రాజకీయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్​ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్​ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్​లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్​ ఆస్పత్రి యజమాని రమేశ్​బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్​ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]

Read More