సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ […]
సామాజిక సారథి, సిద్దిపేట: అనాధ వృద్ధులకు చేయూతనందిద్దామని బెజ్జంకి తహసీల్ధార్ విజయప్రకాశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఎక్స్ రోడ్ వద్ద అనాధ వృద్ధులకు నిత్యవసర వస్తువులు, దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లల అభివృద్ధికి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. బాలవికాస […]
సామాజిక సారథి, షాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత, పలువురి దాతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ది కార్యక్రమాల కల్పనకై దాతలు ముందుకస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లమవుతామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులకు ఐడి […]
సామజిక సారధి,అబ్దుల్లాపూర్మెట్: అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ రామానుజులరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పరిధి సర్వే నెంబర్ 326, నుండి 335 సదాశివా హవెన్స్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా చేపడుతున్న భవన నిర్మాణాలను నిలిపివేశారు. పట్టణంలో అనుమతులు తీసుకున్న తరువాతనే నిర్మాణాలు చేపట్టాలని లేకుంటే, కూల్చివేతలు […]
సామజిక సారధి, తుర్కయంజాల్: బహుజనులు ఏకమవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వద్దిగాళ్ల బాబు అన్నారు. మునుగోడులో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మునుగోడు గడ్డమీద బీఎస్పీ జెండాను ఎగరవేస్తామని చెప్పారు. నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించబోతుందని చెప్పారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మేతిరి కుమార్, […]
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిద్ధామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గూడపూర్, కల్వలపల్లి, జమస్తానపల్లి, పులిపలుపుల గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలోని 4కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 9 ఏండ్లల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందేమిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని […]