సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: 2023లో రాష్ట్ర ప్రజలతో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరారు. రైతులకు పాడిపంటలు కలగాలని ఆకాంక్షించారు. […]
సామాజికసారథి, బిజినేపల్లి: సాకలివాని,చెరువు ఈదుల్ చెరువు, మొద్దుల కుంటలను ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని మత్స్య సహకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. సర్వేచేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేయాలని మండల జనరల్ బాడీ మీటింగ్ లో వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఎంపీపీ, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా కలిశామన్నారు. బిజినేపల్లి చెరువు కుంటలను ఆక్రమిస్తున్న నాయకులకు సహకరిస్తున్న […]
సామాజికసారథి, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్లె రాజు అధ్వర్యంలో పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు రాంబాబు, రాజయ్య, దేవేందర్, రామకృష్ణ, భూమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులతో రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణం నుంచి అనేక మంది తమ ఉద్యోగాల కోసం మంచిర్యాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆర్ఓబి పూర్తి కాకపోవడంతో క్యాతన్ పల్లి రైల్వే గేట్ పడడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు సుమారు ఒక […]
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేసి రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయవ్యవస్థ దేశంలో స్వతంత్రత గల రాజ్యాంగబద్ధ సంస్థ అని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. దేశంలో ఈడీ, సీబీఐ, మీడియా సంస్థలవలే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుందని […]
సామాజికసారథి, పటాన్చెరు: నార్మల్ డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షించడంతో ఓ పసికందు చనిపోయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, మహిళ కుటుంబ సభ్యులతో పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్ పూర్ మున్సిపాలిటీ లింగమయ్య కాలనీకి చెందిన వినోద అనే గర్భిణి ఈనెల 11న ఆదివారం […]
సామాజికసారథి, పటాన్చెరు: సాంకేతిక వ్యవస్థ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవశ్యకత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీ కృష్ణదేవరాయ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక […]
సామాజికసారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ నియోజకవర్గంలో రహదారులకు నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.53కోట్లు, బీటీ రెన్యూవల్ రోడ్లకు రూ.10 కోట్లు, పీడీఆర్ రోడ్లకు రూ.10 కోట్లు, ఆర్ అండ్ బీరోడ్లకు రూ.24 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు రూ.3కోట్లు, మెదక్ దయార రోడ్డుకు రూ.7.80 కోట్లు మొత్తం రూ.107.80 కోట్లు మంజూరు అయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ నియోజకవర్గ నిధులు మంజూరుచేసిన […]