సామాజిక సారథి, షాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత, పలువురి దాతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ది కార్యక్రమాల కల్పనకై దాతలు ముందుకస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లమవుతామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులకు ఐడి […]