Breaking News

బహుజనులు ఏకమవ్వాలి

బహుజనులు ఏకమవ్వాలి

సామజిక సారధి, తుర్కయంజాల్: బహుజనులు ఏకమవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వద్దిగాళ్ల బాబు అన్నారు. మునుగోడులో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మునుగోడు గడ్డమీద బీఎస్పీ జెండాను ఎగరవేస్తామని చెప్పారు. నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించబోతుందని చెప్పారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మేతిరి కుమార్, శ్యామ్, మహేష్ మహారాజ్, లింగం,శంకర్, చరణ్,రవి తదితరులు పాల్గొన్నారు.