Breaking News

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ధోనాధుల సత్యం, డైరెక్టర్లు జోగు వీరయ్య, డోల్యనాయక్, శ్రీపాల్, వెంకటయ్య, అరుణ అంజిరెడ్డి, జంగమ్మ, చేగురి వెంకటేష్, రమేష్, సీఈఓ దేవేందర్, పాల్గొన్నారు.