Breaking News

Day: December 1, 2021

ఎడ్లబండ్లతో నిరసన

ఎడ్లబండ్లతో నిరసన

సామజిక సారథి, రాజోలి : డీజిల్‌, పెట్రోల్‌ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]

Read More
ప్రణాళికలు సిద్ధం చేయాలి

ప్రణాళికలు సిద్ధం చేయాలి

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: లక్ష్యం మేరకు జిల్లాలో మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో  జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 2022 నుంచి  2024 సంవత్సరం వరకు మూడేళ్లపాటు జిల్లాలో వివిధ శాఖల ద్వారా నాటాలల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో 2022 సంవత్సరంలో 46.06 […]

Read More
సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

ములుగు ఎమ్మెల్యే సీతక్క సామజిక సారథి, మంగపేట: సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు దృష్టిసారించాలని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ఇన్స్ రెన్స్ వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ […]

Read More
టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ వల్లే ఓటర్లకు ఫోన్లు, టూర్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి  సామాజిక సారథి, సంగారెడ్డి:  టీఆర్ఎస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయని,  ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1027మంది  ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డిని గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఒక హోటల్ లో మంగళవారం సాయంత్రం డీసీసీ అధ్యక్షురాలు, స్థానిక సంస్థల అభ్యర్థి తూర్పు […]

Read More
మాటేసే.. పట్టుకున్నారు

మాటేసే.. పట్టుకున్నారు

  • December 1, 2021
  • Comments Off on మాటేసే.. పట్టుకున్నారు

లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు పెద్దపల్లిలో ఆర్డీవో, నాగార్ కర్నూల్ జిల్లాలో కార్యదర్శి  సామాజిక సారథి, పెద్దపల్లి/అచ్చంపేట: అవినీతి నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా..  కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాల్సింది పోయి.. తమలోని అవినీతి జలగను మేలుకొలుపుతూ.. ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. రూ.లక్షలు, వేలల్లో జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తికిపోయి.. ఉద్యోగాలే పొగొట్టుకుంటున్నారు.  పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ […]

Read More
నెలసంది గోసపడుతున్నం

నెలసంది గోసపడుతున్నం

కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం మంత్రి హరీశ్​రావు ఎదుట అన్నదాతల గగ్గోలు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్​రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి […]

Read More
పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి

ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]

Read More