సారథి న్యూస్, హైదరాబాద్: రిపబ్లిక్‌టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్గోస్వామిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి విమర్శించారు. రాజకీయ కక్షతో మీడియాకు సంకేళ్లు వేయడం హేయమైన చర్య అని ఖండించారు. అధికారబలంతో భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జాతీయభావాలను ప్రకటించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. జాతివ్యతిరేక శక్తులపై దేశభక్తితో పోరాడే పత్రికాప్రతినిధులు, మీడియా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో […]
సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్‌బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆచూకీ తెలిసిన వారు ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డెడ్‌బాడీని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. […]
షార్జా: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(85 నాటౌట్; […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అవయవ, శరీర దానాలకు 20 మంది అంగీకరించినట్లు అవయవదాన స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుంకరనేని సంధ్యకు అవయవదాన ప్రతినిధుల బృందం అంగీకార పత్రాలు అందజేశారు. తమ మరణానంతరం పార్థీవదేహాలతో పాటు నేత్రాలు, పలు అవయవాలు వైద్య విద్యార్థుల పరిశోధనకు తోడ్పడుతాయని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 20 మంది స్వచ్ఛందంగా ముందుకువచ్చారని వివరించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు […]
సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్‌జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]
సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, […]
సారథి న్యూస్, ములుగు: తెలంగాణ పద్మశాలి అఫీషియల్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(పొపా) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ రాజ్ సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. ములుగు జిల్లా పొపా కమిటీ అధ్యక్షుడిగా ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా చుంచు రమేష్, కోశాధికారిగా ఆడపు రాజు, ఉపాధ్యక్షుడిగా మెరుగు రమేష్, రాంచందర్, సహాయ కార్యదర్శిగా తాళ్ల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా గజ్జెల సుమన్ ను ఎన్నకున్నారు. ములుగు జిల్లాలోని పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషిచేస్తానని చెప్పారు. తన […]