Breaking News

Day: October 26, 2020

పంజాబ్​ అజేయం

కింగ్స్‌ పంజాబ్‌ అజేయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్​చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4×4), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), […]

Read More
నాయిని సతీమణి అహల్య కన్నుమూత

నాయిని సతీమణి అహల్య కన్నుమూత

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య(680 కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. నాయిని నర్సింహారెడ్డి ఈనెల 22న కన్నుమూసిన విషయం తెలిసిందే. ‌ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారినపడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. భర్త నాయిని నర్సింహారెడ్డి మృతితో చివరి చూపునకు అహల్యను కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు. కరోనా నెగటివ్ […]

Read More
డిపార్ట్​మెంట్​కు మంచిపేరు తేవాలి

డిపార్ట్​మెంట్​కు మంచిపేరు తేవాలి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: క్రమశిక్షణతో ఉంటూ స్టేషన్ కు వచ్చే బాధితులను గౌరవిస్తూ పోలీస్ శాఖకు మరింత మంచిపేరు తీసుకురావాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలని కోరారు. 9నెలల ట్రైనింగ్ అనంతరం జిల్లా పోలీసు డిపార్ట్​మెంట్​లో విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడులోని సీఎన్​జీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ పలు సూచనలు […]

Read More
తేమ లేని వడ్లు తీసుకురండి

తేమ లేని వడ్లు తీసుకురండి

సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం.హనుమంతరావు సూచించారు. సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తయిందని, అయితే అకాల వర్షాలు కురవడంతో వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ ​హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు […]

Read More
మెదక్​కలెక్టర్​గా ఎం.హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

మెదక్​ కలెక్టర్​గా ఎం.హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ ​జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో కృషిచేస్తానని కలెక్టర్​ఎం.హనుమంతరావు ప్రకటించారు. సోమవారం మెదక్ ​జిల్లా కలెక్టర్​గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏడుపాయలలో ఆలయ ఈవో శ్రీనివాస్​కలెక్టర్​కు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గామాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వనదుర్గామాత అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని.. జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించే ముందు దుర్గామాతను […]

Read More
ఇళ్లు కట్టి చూపించాం

ఇళ్లు కట్టి చూపించాం

సారథి న్యూస్, హైదరాబాద్: జియాగూడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్​ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేను కట్టిస్తా. పెండ్లి నేను చేస్తా అన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే’ అని సృష్టంచేశారు. డబుల్ […]

Read More
కొట్రలో దసరా మహోత్సవం

కొట్రలో దసరా మహోత్సవం

సారథి న్యూస్, వెల్దండ: విజయదశమి మహోత్సవాన్ని నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. చుట్టాలు, బంధువులు, కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం జమ్మిచెట్టు వద్దకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయుధపూజ నిర్వహించారు. శమీ మంత్రం జపించారు. ఈ యేడు తమకు కాలం ఎలా కలిసొస్తుందో.. ఆదాయ వ్యయాలను సరిచూసుకున్నారు. అనంతరం జమ్మి ఆకులు తెంచి.. […]

Read More
ఆంధ్రప్రదేశ్ లో లంబోర్గిని కార్ల యూనిట్​

ఏపీలో లంబోర్గిని కార్ల యూనిట్​

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక వాహనాల తయారీ యూనిట్‌ రానుంది. ప్రముఖ స్పోర్ట్స్‌ వెహికల్‌ బ్రాండ్‌ లంబోర్గిని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. గోల్ఫ్, ఇతర క్రీడల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, […]

Read More