Breaking News

PALEM

పాలెం లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

సామాజిక సారథి , నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామం లో ని తోట పల్లి సుబ్రమణ్యం విద్యాలయం లోనీ పాఠశాలలో1997 – 1998 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు బాలాజీ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సుబ్బయ్య విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు […]

Read More

పాలెం లో గోవా బ్యాచ్ అడ్డదారులు

# నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు#.తమ బాగోతాలు బయటపడుతుండడంతో గగ్గోలు పెడుతున్న గంజాయి బ్యాచ్# తప్పుడు పనులు చేసే వారికి అనుకూలంగా , వార్తలు రాస్తేనే అసలైన జర్నలిస్టులా ?# ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటున్న విలేకరులు# నిజాలు నిర్భయంగా రాస్తామంటూ గోవా బ్యాచ్ కు హెచ్చరిక# రెండు రోజుల్లో గోవా బాధితుల తో ప్రత్యేక కథనాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కొందరు […]

Read More
దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై […]

Read More
కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

వీఆర్ఏ కుటుంబం ఆత్మహత్యాయత్నం పురుగు మందు తాగిన భార్య నాగర్​ కర్నూల్​ జిల్లా పాలెంలో విషాదకర ఘటన సామాజికసారథి, బిజినేపల్లి: జీతం రాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. అప్పులు తీర్చలేక ఓ వీఆర్ఏ కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మంగళవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వేపూరి రాజేశ్ పాలెం వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం […]

Read More
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ […]

Read More
బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం..

మా కూతురుకు ఏమైందో చెప్పండి మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన కలెక్టర్​, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు సామాజికసారథి, మహబూబ్​నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్​అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. […]

Read More
కొల్లాపూర్​ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​ దుర్మరణం

కొల్లాపూర్​ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​ దుర్మరణం

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్​ ప్రతినిధి​: నాగర్​ కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్​ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రభాకర్​ రెడ్డి(48) ఇకలేరు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా నాగర్ కర్నూల్​ దాటిన తర్వాత నెల్లికొండ చౌరస్తాలో అతివేగంతో వచ్చిన కారుఆయనను ఢీకొట్టింది. దీంతో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్​రెడ్డి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకుడిగా ఆయనకు […]

Read More
పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటోనిచెరువు తూము నుంచి రైతులకు చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టులో పంటలు సాగుచేసేందుకు వీలుగా సర్పంచ్ గోవింద్ లావణ్య నాగరాజు, ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను నీటితో నింపిన ఘనత టీఆర్ఎస్​ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పంటలు పండించడానికి వీలుగా నీటి వసతి కల్పించిన నాగర్ […]

Read More