Breaking News

Day: October 2, 2020

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి

సారథి న్యూస్, ధర్మారం(రామగుండం): అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ బహూకరించి నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిని వీలైనంత వరకు వెడల్పు చేసి అత్యాధునిక వీధిదీపాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,82,500 విలువైన చెక్కులను 9మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.

Read More
అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులకు శ్రీకారం

సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రూ.8.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐబీ కార్యాలయం […]

Read More
జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: వృత్తి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మానవతాభావాన్ని చూపకపోవడం అన్యాయమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రతినిధి నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంయుక్త పిలుపు మేరకు శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత […]

Read More
మంత్రికి ఘనస్వాగతం

మంత్రికి ఘనస్వాగతం

సారథి న్యూస్, శ్రీకాకుళం(సీతంపేట): సీతంపేట ఐటీడీఏలో ఏర్పాటుచేసిన అటవీహక్కు(ఆర్వోఎఫ్ఆర్ పట్టాల) పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఆయన పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో శ్రీధర్ ఘనస్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో జీసీసీ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ జే.నివాస్, […]

Read More

బిగ్​బాస్​లోకి దేవీ రీఎంట్రీ!

గత వారం అనూహ్యంగా బిగ్​బాస్​హౌస్​ నుంచి ఎలిమినేట్​ అయిన దేవీ వైల్డ్​కార్డ్​ ఎంట్రీ ద్వారా హౌస్​లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. మెహబూబ్​కు తక్కువ ఓట్లు ఉంటే దేవీని ఎలిమినేషన్​ చేశారని మొదటినుంచి ఓ ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. మరోవైపు పవన్​కల్యాణ్​ అభిమానులు, టీవీ9ను వ్యతిరేకించారు దేవీకి నెగెటివ్​గా ప్రచారం చేయడంతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని ప్రచారం జరిగింది. అయితే దేవీ హౌస్​నుంచి బయటకు వచ్చాక ఆమెకు సోషల్​మీడియా మద్దతు లభించింది. దేవీ లాంటి స్ట్రాంగ్​ కంటెంస్టెంట్​ను కుట్రపూరితంగా […]

Read More
చితికిన చిరు వ్యాపారులు

చితికిన చిరు వ్యాపారులు

ఆదుకోని ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ దివాళా తీసిన వ్యాపారాలు సారథి న్యూస్​, హైదరాబాద్​: కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో తోపుడు బండ్ల వారి నుంచి మధ్య తరగతి వ్యాపారుల వరకూ అందర్నీ ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ, వారిలో ఆత్మ నిబ్బరాన్ని పెంచలేకపోయింది. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఆయా వ్యాపారులకు ఒక్క పైసా రాలేదు. దేశంలో మార్చి 25న లాక్‌డౌన్‌ విధించగా.. గత శుక్రవారం నాటికి సరిగ్గా ఆర్నెళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా […]

Read More
రోజుకు 88 మంది.. అందులో ద‌ళితులు 11 మంది

రోజుకు 88 మంది.. ద‌ళితులు 11 మంది

కామాంధుల‌కు బ‌ల‌వుతున్న భార‌తీయ వ‌నితలు వీళ్లు దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక‌దాడులు గ‌తేడాది 32వేల మంది బాధితులు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి న్యూఢిల్లీ : స్త్రీని దేవ‌త‌గా పూజించే దేశంలో మ‌హిళ‌ల‌కు ర‌క్షణ కరువవుతోంది. దేశంలో ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఏ మూల‌కెళ్లినా మ‌న స్త్రీల‌కు భ‌ద్రత లేదన్నది స్పష్టమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ‌దేశంలో రోజుకు ఏకంగా 88 మంది మ‌న త‌ల్లులు, అక్కాచెళ్లెల్లు కామాంధుల కాటుకు బ‌ల‌వుతున్నారు. […]

Read More
10 లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు

10లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు

కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్​ వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి లక్షలాది మంది ప్రజలు బలవుతున్నారు. అయితే వివిధ దేశాలు నివేదిస్తున్న మరణాల లెక్కలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా దేశాలు కరోనా మరణాలను చూపించడం లేదని, చాలా దేశాలు వాటిని దాచి పెడుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ లో భాగంగా యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశం […]

Read More