చిలిపిగా కవ్విస్తుంది.. మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది.. మొత్తానికి నటనతో మెస్మరైజ్ చేస్తుంది నివేదా పేతురాజ్. ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘బ్రోచేవారెవరురా’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురము’లో సినిమాలతో మెప్పించిన నివేదా ప్రస్తుతం రామ్ రెడ్ చిత్రంతో పాటు సాయిధరమ్ తేజ్, దేవా కట్టా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ పార్టీ, పొన్ మాణిక్వేల్ మూవీస్ తో పాటు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘జెగజాల కిల్లాడీ’ అనే సినిమాకు సంతకం […]
సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది నీరుగారుస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకుండా హైస్కూల్ పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడేస్తున్నారు. ఈ చెత్తతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్ కి మొరపెట్టుకున్నా ట్రాక్టర్ […]
‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన సిద్దార్థ తమిళ వాడే అయినా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి లవ్ స్టోరీస్‌తో తెలుగులోనే ఎక్కువ ఆదరణ పొందాడు. అనుకోకుండా తెలుగులో తనకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ తర్వాత మళ్లీ తెలుగులోపూర్తిస్థాయిలో కనిపించలేదు. 8 ఏళ్లకు మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. శర్వానంద్ హీరోగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఇటీవల ఈ సినిమాపై […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ శివారు లోని సోమాజిచెరువు నాలుగేండ్ల తర్వాత అలుగుపారడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చెరువు మత్తడి దుంకింది. దీంతో పిల్లలు, యువకులు అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాలవారు అక్కడికి చేరుకొని చెరువు అందాలను తిలకించారు.
సారథిన్యూస్, గద్వాల: త్వరలో జరుగబోతున్న తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని.. పుష్కరఘాట్ల వద్ద మరమ్మతులు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అలంపూర్‌లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కేవలం అలంపూర్ ఒక్కచోటే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని.. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం పులికలు, వేణిసోంపురం, రాజోలి, తుమ్మిళ్ల, పుల్లూరు, అలంపూర్ వద్ద ఉన్న పుష్కరఘాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం బాగుచేయాలని కోరారు. […]
సారథిన్యూస్, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది. విష్ణుకు సిస్టర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్‌ను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం వణికించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పునాది ఇండియాలోనే పడింది. దీనికి సంబంధించిన రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. […]