సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళపూర్ గ్రామంలో పల్లెప్రగతి 4వ విడత, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గుండ రమ్య పలు రకాల పూలజాతుల మొక్కలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇస్తున్న ఆరు మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్, ఏపీఎం త్రివేణి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ గుండ గంగయ్య, సీఏ గాయత్రి, బి.శేఖర్, పి.హరీశ్,గ్రామస్తులు పాల్గొన్నారు.
సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో […]
సారథి, కొల్లాపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ఇంటింటా చెత్తసేకరణ, […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో పల్లెప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామస్తులను కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ చిలుక రవిందర్, ఎంపీటీసీ తోట […]
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి, పెద్దశంకరంపేట: పల్లె ప్రగతి పనులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అందుకోసం ప్రజలంతా సమష్టిగా కృషిచేయాలని కోరారు. ఆదివారం ఆయన మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో మహిళా సంఘాల సభ్యులకు మొక్కలు అందజేశారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించడం, మురికి కాల్వలను శుభ్రంచేయడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనుల్లో భాగంగా శనివారం శానిటేషన్, ఇంటింటికీ మొక్కల పంపిణీ చేపట్టారు. వర్షపు నీరు నిలిచే ఎగుడు దిగుడు ప్రాంతాల్లో మొరం పోయించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, గ్రామస్తులు, మండల అధికారులు పాల్గొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పల్లెప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం కాట్నపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం, పారిశుద్ధ్యం పల్లెప్రగతి ముఖ్య లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికల నిర్మించుకున్నామని చెప్పారు. తల్లిదండ్రుల చనిపోయి అనాథలుగా మారిన సమత, మమతకు దాతల నుంచి రూ.16లక్షలను వారి బ్యాంకు […]
సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో తమకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఎంపీటీసీ సభ్యులు నిరసన చేపట్టారు. గెలిచి రెండేళ్లు గడిచినా కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ల మాదిరిగానే ఎంపీటీసీలు కూడా ప్రత్యేక్షంగా ప్రజల చేత ఎన్నుకున్నారని గుర్తుచేశారు. వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో […]