విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విరుచుకుపడ్డారు. కంగనా తనను తాను అతిగా ఊహించుకుంటుందని విమర్శించారు. కంగనా రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించినంత మాత్రాన ఆమె నిజంగా లక్ష్మీబాయిలా ఫీలయిపోతుందని పేర్కొన్నారు. ఆమె లక్ష్మీబాయి అయితే మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, అశోక చక్రవర్తిగా నటించిన షారుక్, భగత్ సింగ్ గా నటించిన అజయ్, మంగళ్ పాండేగా నటించిన అమీర్‌ఖాన్, మోదీగా నటించిన వివేక్ ఒబేరాయ్ […]
సారథిన్యూస్, అమరావతి: జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 950కు చేరింది. ఒక్కరోజే 2,458 మంది కోవిడ్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 32,005 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 77.75 శాతంగా […]
కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ పుట్టిన దేశమైన చైనా సేఫ్జోన్లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే ఈ వైరస్‌ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]
లక్నో: కరోనా పుణ్యమా! అని ప్రజలందరిలోనూ శానిటైజర్, మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ దొంగల ముఠా దీనినే ఆసరాగా చేసుకుని బంగారు నగల దుకాణాన్ని లూటీ చేసింది. సాధారణ కస్టమర్ల మాదిరిగానే నగల షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు అక్కడ నగలు అమ్మే వ్యక్తి ముందు శానిటైజర్ కోసం చేయి చాచాడు. అతడు కూడా వచ్చినవారు కస్టమర్లు కావచ్చు అనుకుని వారి చేతికి శానిటైజర్ ద్రావణాన్ని చల్లాడు. అంతే.. ఇంతలోనే ఒక దొంగ […]
బాలీవుడ్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్‌సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె డ్రగ్స్‌కేసులో 25 మంది పేర్లు చెప్పినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 25 మందిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్ నౌ ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలోకి ప్రవేశాలకు అడ్మిషన్లు నిర్వహించేందుకు గాను పరీక్ష తేదీని ప్రభుత్వం ఖరారుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏప్రిల్‌లో జరగాల్సిన ఎగ్జామ్ ను వాయిదావేసింది. పరిస్థితులు కుదుటపడుతుండడంతో నవంబర్1న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్15వ తేదీ వరకు గురుకుల వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో 48,240 సీట్ల కోసం 1,48,168 అప్లికేషన్లు వచ్చాయని […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని చిల్డ్రన్ పార్కు లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కబ్జాచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ చెరువులో పెద్దఎత్తున ఇసుకను తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు ఇంటి బాత్రూమ్ను కట్టుకోవడానికి ట్రాక్టర్ […]