Breaking News

Day: August 18, 2020

సింగరేణిని కాపాడుకుందాం

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్​పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్​జీవన్​ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్​ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]

Read More

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

సారథిన్యూస్​, వరంగల్​: వరదబాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్​, ఈటల, ఎర్రబెల్లి దయాకర్​, సత్యవతి రాథోడ్​ హామీ ఇచ్చారు. మంగళవారం వారు వరంగల్​ నగరంలో పర్యటించారు. మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ హైదరాబాద్​ నుంచి వరంగల్​కు హెలీక్యాప్టర్​లో వెళ్లారు. అనంతరం ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్​తో కలిసి వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, […]

Read More

చంద్రశేఖర్​గౌడ్​కు సన్మానం

సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఎన్నికైన అరెల్లి చంద్రశేఖర్​గౌడ్​ను మంగళవారం డీపీడీఎఫ్​( డెమొక్రటిక్​ ప్రైవేట్​ టీచర్స్​ యూనియన్​ ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చంద్రశేఖర్​గౌడ్​ గతంలో డీపీడీఎఫ్​ గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. చంద్రశేఖర్​గౌడ్​ ఆధ్వర్యంలో వ్యవసాయమార్కెట్​ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ వైస్​ చైర్మన్​ కొత్తగంగారెడ్డి, డీపీడీఎఫ్​ నాయకులు మాచర్ల మహేశ్​, ఉపాధ్యక్షుడు గోవులకొండ అనిల్​, కోశాధికారి రమేశ్​, సభ్యులు […]

Read More

నిర్వాసితులంటే ఇంత నిర్లక్ష్యమా!

సారథిన్యూస్, రామడుగు: నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ విఫలమయ్యారని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్​ రిజర్వాయర్​ కోసం ఎందరో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయారని ఎమ్మెల్యే రవిశంకర్​ కనీసం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం జోజిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జంగం అంజయ్య, గంగాధర మండల […]

Read More

సీఎంఆర్​ఎఫ్​ పేదలకు అండ

సారథిన్యూస్​, రామడుగు/ బోయినపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజలకు ఎంతో అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ కింద మంజూరైన రూ. 8లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యాక్రమంలో బాధితులు, ఆయాగ్రామాల సర్పంచుల్​, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Read More

భిక్షాటన చేసైనా రైతులను ఆదుకుంటా

సారథిన్యూస్​, తల్లాడ: భిక్షాటన చేసైనా రైతులను ఆదుకుంటానని ఎస్సీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​, సత్తుపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పిడమర్తి రవి భరోసా వాఖ్యానించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం రైతులకు వ్యక్తిగతంగా రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుడేటి వీరారెడ్డి, అనుమోలు బుద్ధి […]

Read More

పీహెచ్​సీ ఆకస్మిక తనిఖీ

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీని రాష్ట్ర కోవిడ్​ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పీహెచ్​సీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎన్ని పాజిటివ్​ వచ్చాయి తదితర వివరాల గురించి రాష్ట్ర బృందం ఆరా తీసింది. డాక్టర్​ ప్రభావతి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పీహెచ్​సీ రికార్డులను పరిశీలించింది. కార్యక్రమంలో పీహెచ్​సీ సిబ్బంది భూమయ్య, రామ్మోహన్​, విజయభాస్కర్​ తదితరులు పాల్గొన్నారు.

Read More

గణేశ్​ మండపాలకు నో పర్మీషన్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్​ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More