న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్ వారిపై సీరియస్ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్ అయింది. పాంగాంగ్, గోగ్రా పోస్ట్ నుంచి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 52,466 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా, మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 447 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 3, 37, 771 శాంపిల్టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 683 నమోదయ్యాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి 24, కామారెడ్డి 56, కరీంనగర్100, మహబూబాబాద్44, మెదక్22, మేడ్చల్30, నాగర్‌కర్నూల్52, నల్లగొండ 42, పెద్దపల్లి […]
బెంగళూర్: పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రైనింగ్ సెంటర్‌లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో […]
సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్‌లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఓఎస్డీ, కలెక్టర్ క్యాంప్ క్లర్క్‌లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్రేట్కు వచ్చినవారిలో […]
సారథి న్యూస్, నెట్వర్క్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విపత్తువేళ తగిన జాగ్రత్తలు పాటిస్తూ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్‌చేసి, నిరుపేదలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కేక్ కట్‌చేసి పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లాడలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, […]
న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ఫైర్ అయ్యారు. 20 – 25 మంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిపోతావా? అంటూ ప్రశ్నించారు. పార్టీని పబ్లిక్ ముందు తమాషా చేయొద్దన్నారు. ‘సచిన్ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు సీఎం అవ్వాలని అనుకుంటున్నవా? మాకు చెప్పు. ఈ తిరుగుబాటు ఎందుకు? బీజేపీతో కలవను అని చెబుతున్న నీవు హర్యానాలో ఎందుకు ఉన్నావు. పార్టీ సమావేశాలకు ఎందుకు రాననుంటున్నావు. […]
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లోని నెపోటిజం గురించి ఆరోపించిన ప్రముఖనటి కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాంద్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఆమెను కోరారు. నోటీసులు ఇచ్చిన విషయాన్ని కంగనా తరఫు లాయర్ కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె మనీలాలో ఉందని, ఒక టీమ్‌ను అక్కడికి పంపి స్టేట్‌మెంట్‌ను పర్సనల్‌గా రికార్డ్ చేయాలని పోలీసులను కోరామని ఆయన అన్నారు. కాగా, సుశాంత్ సింగ్ […]
సారథిన్యూస్, సూర్యాపేట: కాలకృత్యాలు తీర్చుకొనేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురిని కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కృత్తివేలు మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద కారు ఆపారు. వారు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుకనుంచి మరో కారు […]