సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర […]
సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సారథిన్యూస్, సూర్యాపేట: కాలకృత్యాలు తీర్చుకొనేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురిని కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కృత్తివేలు మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద కారు ఆపారు. వారు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుకనుంచి మరో కారు […]
సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
సారథిన్యూస్ సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాల్లోనూ అనూహ్యంగా కేసులు పెరుగుతున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ నర్సుకు, ఆమె కుటుంబసభ్యులకు కరోనా సోకింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. మరోవైపు జిల్లా దవాఖానలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది తమకు కరోనా పరీక్షలు చేయండంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు విన్నవించుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా తమకు కరోనా పరీక్షలు చేయడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.
సారథిన్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్‌లను […]
సారథి న్యూస్, సూర్యాపేట: మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుపై వేటుపడింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఎస్పీ భాస్కరన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు.
సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి అమరజవాన్ కల్నల్ సంతోష్‌బాబు పేరు పెడతామని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో నిర్వహించిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదీశ్‌రెడ్డి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసారం గ్రామాన్ని కల్నల్ సంతోష్‌బాబు జ్ఞాపక చిహ్నంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని చెప్పారు. చైనా సైన్యాన్ని తరిమికొట్టడంతో కల్నల్ […]